మూడో రోజూ మార్కెట్లకు లాభాలు

Apr 23,2024 21:30 #Business

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలాంశాలతో మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీలు రాణించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 89.84 పాయింట్ల లాభంతో 73,738కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 22,368 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో 2,224 షేర్లు లాభపడగా.. 1450 షేర్లు ఒత్తిడికి గురైయ్యాయి. మరోవైపు 109 సూచీలు యథాతథంగా నమోదయ్యాయి. సెన్సెక్స్‌ 30లో భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ, టాటా మోటార్స్‌ షేర్లు అధికంగా లాభపడగా.. మరోవైపు సన్‌ఫార్మా, రిలయన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.

➡️