కాంగ్రెస్‌లోకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Jan 22,2024 08:39 #Alla Ramakrishna Reddy, #Congress

ప్రజాశక్తి-విజయవాడ :  వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్ షర్మిల సాదరంగా ఆయనను ఆహ్వానించారు. తనతోపాటు శెట్టి గంగాధర్, మరి కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

➡️