గ్లాస్‌ని గాల్లో ఎగరేస్తూ.. డ్రింక్‌ మిక్సింగ్‌ : వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ : జ్యూస్‌పై డిఫరెంట్‌గా గార్నిష్‌ చేసి అమ్మడం రోడ్డుపై చూస్తూనే ఉంటాం. అయితే ఊహకందని విధంగా గ్లాస్‌ని గాల్లో ఎగరేస్తూ.. డ్రింక్‌ని మిక్స్‌ చూశారా? రోడ్డుపై ఓ యువకుడు డిఫరెంట్‌గా డ్రింక్‌ని అమ్మడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో డ్రింక్స్‌ అమ్మే అతను ఒక గాజు గ్లాసు తీసుకుని ఐస్‌, పాలతోపాటు మిగిలిన కొన్ని పదార్థాలు వేసి దానిపై ఓ గ్లాసు పెట్టి గాల్లో ఎగరేస్తూ.. ఆ డ్రింక్‌ని మిక్స్‌ చేశాడు. అతనలా మిక్స్‌ చేస్తుంటే.. ఎవరైనా సరే అతన్ని చూసి నోరెళ్లబెట్టాల్సిందే. అంత టెక్నిక్‌గా డ్రింక్‌ని మిక్స్‌ చేశారు. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌మహీంద్రా తన సామాజిక మాధ్యమం ఎక్స్‌్‌లో పోస్టు చేశారు. ‘ప్రతిభ ఏరకంగానైనా ఉంటుంది. అది ఎప్పుడైనా బయటపడుతుంది.’ అని ఆయన ఈ వీడియోకు జత చేశారు. అతని ప్రతిభను మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టే ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ఇక ఈ వీడియోను పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే 2.7 లక్షలమంది నెటిజన్లు వీక్షించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీడియోలోని వ్యక్తి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? అతని పేరేంటి అనే వివరాలు వెల్లడించలేదు.

➡️