అక్రమాస్తుల కేసులో తమిళనాడు మంత్రి దోషి

Dec 19,2023 15:42 #Madras High Court, #tamilnadu

చెన్నై : అక్రమాస్తుల కేసులో డిఎంకె నేత,  తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడిని మద్రాస్‌ హైకోర్టు మంగళవారం దోషిగా నిర్థారించింది. ఆయన భార్య పి. విశాలక్షిని కూడా దోషిగా పేర్కొంది. శిక్ష విధించడానికి ముందు గురువారం (డిసెంబర్‌ 21)న కొర్టులో హాజరుకావాలని ఇరువురిని ఆదేశించింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్‌ జి.జయచంద్రన్‌ అనుమతించారు. విల్లుపురంలోని అవినీతి నిరోధక చట్టం కేసుల్లో 2016, ఏప్రిల్‌ 18న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా పక్కనపెట్టింది. సీనియర్‌ న్యాయవాది ఎన్‌.ఆర్‌. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్‌ చేయాలని జడ్జిని కోరారు. ఈ పిటిషన్‌ను డిసెంబర్‌ 21న విచారిస్తామని చెప్పారు. 2006 ఏప్రిల్‌ 13 మరియు 2010 మార్చి 31 మధ్య కాలంలో నిందితులు రూ.1.79 కోట్ల ఆక్రమాస్తులను కూడబెట్టినట్లు ప్రాసిక్యూషన్‌ పేర్కొంది.

➡️