చెన్నైకు లక్నో చెక్‌

Apr 20,2024 08:27 #Sports
  • అర్ధసెంచరీలతో మెరిసిన డికాక్‌, రాహుల్‌
  • ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు

లక్నో: చెన్నై సూపర్‌ కింగ్స్‌కు లక్నో సూపర్‌ జెయింట్‌ చెక్‌ పెట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉన్న చెన్నైకు శుక్రవారం లక్నో కళ్లెం వేసింది. భారత్‌రత్న అటల్‌బిహారి వాజ్‌పేయి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 176పరుగులు చేయగా.. లక్నో జట్టు 19 ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 180పరుగులు చేసి సునాయాసంగా ఛేదించింది. లక్నో ఓపెనర్లు డికాక్‌(54), కెఎల్‌ రాహుల్‌(82) తొలి వికెట్‌కు 134పరుగుల భారీ భాగస్వామ్యాన్ని గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కెఎల్‌ రాహుల్‌కు లభించింది. అంతకుముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు తొలుత తడబడ్డా.. చివర్లో చెలరేగాడు. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన చెన్నై కోలుకోలేదు. శివం దూబే(3)ను స్టోయినిస్‌ తొలి బంతికే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ సమీర్‌ రిజ్వీ(0) భారీ షాట్‌ ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. దాంతో, 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై కష్టాల్లో పడింది. చెన్నై 5 వికెట్లు కోల్పోయాక ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(57), ధోనీ(28) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగారు. దీంతో చెన్నై జట్టు గౌరవప్రద స్కోర్‌ చేసింది. లక్నో బౌలర్లు కృనాల్‌ పాండ్యకు రెండు, మొహిసిన్‌, యశ్‌ ఠాకూర్‌, రవి బిష్ణోరు, స్టొయినీస్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో లక్నో ధాటిగానే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు గట్టి పునాది వేసినా లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత పూరన్‌(19), స్టొయినీస్‌(8) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. దీంతో ఈ సీజన్‌లో లక్నో జట్టు నాల్గో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి ఎగబాకింది.

స్కోర్‌బోర్డు…
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ : రహానే (బి)కృనాల్‌ పాండ్య 36, రచిన్‌ రవీంద్ర (బి)మొహిసిన్‌ ఖాన్‌ 0, గైక్వాడ్‌ (సి)కెఎల్‌ రాహుల్‌ (బి)యశ్‌ ఠాకూర్‌ 17, జడేజా (నాటౌట్‌) 57, శివమ్‌ దూబే (సి)కెఎల్‌ రాహుల్‌ (బి)స్టొయినీస్‌ 3, సమీర్‌ రిజ్వి (స్టంప్‌)కెఎల్‌ రాహుల్‌ (బి)కృనాల్‌ పాండ్య 1, మొయిన్‌ అలీ (సి)ఆయుష్‌ బడోని (బి)రవి బిష్ణోరు 30, ధోనీ (నాటౌట్‌) 28, అదనం 4, (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 176పరుగులు. వికెట్ల పతనం: 1/4, 2/33, 3/68, 4/87, 5/90, 6/141 బౌలింగ్‌: హెన్రీ 3-0-26-0, మొహిసిన్‌ ఖాన్‌ 4-0-37-1, యశ్‌ ఠాకూర్‌ 4-0-45-1, కృనాల్‌ పాండ్య 3-0-16-2, రవి బిష్ణోరు 4-0-44-1, స్టొయినీస్‌ 2-0-7-1
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ : డికాక్‌ (సి)ధోని (బి)ముస్తాఫిజుర్‌ 54, కెఎల్‌ రాహుల్‌ (సి)జడేజా (బి)పథీరణ 82, పూరన్‌ (నాటౌట్‌) 19, స్టొయినీస్‌ (నాటౌట్‌) 8, అదనం 13. (19 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 180 పరుగులు. వికెట్ల పతనం: 1/134, 2/161 బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-26-0, దేశ్‌పాండే 4-0-42-0, ముస్తాఫిజుర్‌ 4-0-43-1, జడేజా 3-0-32-0, పథీరణ 4-0-29-1, మొయిన్‌ అలీ 1-0-5-0

➡️