అనాలోచిత నిర్ణయాలతో జీవితాలు నాశనం

Apr 21,2024 21:58
విద్యార్థులు క్షణికావేశంలో

ప్రజాశక్తి – గండేపల్లి

విద్యార్థులు క్షణికావేశంలో అనాలోచితంగా ఆలోచించి జీవితాలను నాశ నం చేసుకోవడం సరికాదని స్పందన ఇంటర్నేషనల్‌ ఫౌం డేషన్‌ కాకినాడ జిల్లా శాఖ ప్రతినిధి, పర్యావరణ మిత్ర తోటకూర గంగాధర్‌ అన్నారు. ఆదివారం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ గ్రంథాలయ విభాగంలో జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భ:గా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తీర్ణిత సాధించలేకపోయామన్నా బాధతో విద్యార్దులు ఎంతో విలువైన జీవితాన్ని ఆవేశంతో అనాలోచితంగా ముగింపు పలకటం పిరికితనమేనని అన్నారు. కొందరు విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌ను, తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకున్న ఆశలను అడియాశలు చేస్తున్నారని అన్నారు. గ్రంథాలయ విభాగం అధిపతి కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా పరీక్షా తప్పినా సప్లిమెంటరీ రాసి ఫలితాన్ని సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.నాగబాబు, రమ్య, గ్రంథాల సిబ్బంది, హాస్టల్‌ విద్యార్దులు పాల్గొన్నారు.

➡️