ఒక పక్షిలా …

Jan 8,2024 08:47 #sahityam

ఓ రైతు, పొలంలో పక్షులను

పొద్దుటినుంచీ తరిమితరిమి అలసిపోయాడు

అవి అటు చెరుకుతోటలోకి

ఇటు వరిపొలంలోకి పదేపదే వాలుతున్నాయి

 

అతనంటాడు :

పక్షికి అతివాదం నచ్చదు

అధికారం నచ్చదు

వినాశనాన్ని సమర్ధించదు

కేవలం స్వేచ్ఛ కోరుకుంటుంది స్వేచ్ఛ

 

మన జీవితం ఎక్కడో వ్యాపారం అయిపోయింది

ఏదీ సహజంగా మాగి రాలడంలేదు

సుఖం అర్థమయినంత సులభంగా

ప్రజలు అర్థం కాలేదు

చెట్టుకోసేస్తే బోసిపోయిన ప్రాంతంలో ఏర్పడే శూన్యంలా

ప్రతిచోటా పొడి నగత్వం

అనంటాడు…

 

ఇన్ని సవాళ్ళ మధ్యా

,పంటకోతకు కొన్ని ఆరు తడుల దూరమే ఉందని

కేవలం లేగదూడ పేయైతే చాలని తృప్తిపడుతున్నాడు

చిన్నచిన్న విషయాలకు చింతలకండు వాకాక

దానిని గాలిలో విదిలిస్తున్నాడు రైతు, పక్షిలాగా !

– శాంతయోగి యోగానంద91107 70545

➡️