డిసెంబర్‌ 2 నుంచి లెజెండ్స్‌ క్రికెట్‌ టర్నీ

Nov 30,2023 22:30 #Sports

– ప్రపంచ వ్యాప్తంగా 70 మంది క్రికెటర్లు రాక

– ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపినాథ్‌రెడ్డి

ప్రజాశక్తి -పిఎం పాలెం (విశాఖ) :లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌ టీ-20 తొలి దశ మ్యాచ్‌లకు విశాఖ పిఎం.పాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఎసిఎ – విడిసిఎ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదిక కానుందని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్‌ 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఐదు జట్లు తలపడతాయన్నారు. లీగ్‌లో పాల్గోనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దాదాపు 70 మంది క్రికెటర్లు వైజాగ్‌కు రానున్నారని వెల్లడించారు. గౌతమ్‌ గంభీర్‌ సారథిగా వ్యవహరించే ఇండియా క్యాపిటల్స్‌ కెవిన్‌ పీటర్స్‌న్‌, యశ్‌పాల్‌సింగ్‌, రిచర్డ్‌ పావెల్‌, మునాఫ్‌ పాటేల్‌, దిల్హార్‌ ఫెర్నాండో తదితరులు ఉన్నారు. హర్బజన్‌సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించే మణిపాల్‌ టైగర్స్‌ జట్టులో ఎస్‌.బద్రినాథ్‌, రాబిన్‌ ఊతప్ప, మహ్మద్‌ కైఫ్‌, ప్రవీణ్‌కుమార్‌, పంకజ్‌ సింగ్‌, మిశ్చెల్‌, కారీ అండర్సెన్‌, సురేష్‌ రైనా సారథిగా వ్యవహరించే అర్బన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో మార్టిన్‌ గుప్తిల్‌, డానే స్మిత్‌, ప్రజ్జాన్‌ ఓజా, టినో బెస్ట్‌, చమర కాపుగెందర్‌, పార్థీవ్‌ పటేల్‌ కెప్టెన్‌గా వ్యవహరించే గుజరాత్‌ జైంట్స్‌ జట్టులో క్రిస్‌ గేల్‌, కెవిన్‌ ఓ బ్రియన్‌, హమీద్‌ రజా, ఎస్‌.శ్రీశాంత్‌, ఆరన్‌ ఫించ్‌ సారథిగా ఉన్న సదరన్‌ సూపర్‌స్టార్స్‌ జట్టులో అబ్దుల్‌ రజాక్‌, టేలర్‌, ఉపుల్‌ తరంగ, అశోక్‌ దిండా తదితరులు ఉన్నారు. షెడ్యూల్‌ ఇలా.. డిసెంబర్‌ 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఇండియా క్యాపిటల్స్‌, మణిపాల్‌ టైగర్స్‌, 3న మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్‌ జైంట్స్‌, సదరన్‌ సూపర్‌ స్టార్స్‌, 4న సాయంత్రం 7 గంటలకు మణిపాల్‌ టైగర్స్‌, అర్బన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి.

➡️