అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా 9నుంచి ర్యాలీలు, సభలు

labour union on anganwadi strike

 

సి ఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా ఈ నెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సభలు నిర్వహించనున్నట్లు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు ప్రకటించాయి. ఈ మేరకు మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు కె పొలారి మాట్లాడారు. అంగన్‌వాడీలు 21 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని తెలిపారు. 30 లక్షల మంది లబ్ధిదారులు కూడా వారికి మద్దతు ఇస్తున్నారని, అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యాన నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. సమ్మెను అణచేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, అయినా మహిళలు లొంగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఐఎఫ్‌టియు నాయకులు రవిచంద్ర పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి సమగ్రశిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికే ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.

➡️