విద్యతోనే విజ్ఞానం

విద్యార్థులకు విద్యతో పాటు

మాట్లాడుతున్న టిెపుల్‌ ఐటి డైరెక్టర్‌ కె.వి.జి.డి బాలాజీ

  • ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ కె.వి.జి.డి బాలాజీ

ఎచ్చెర్ల: విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానం, వినోదం అవసరమని ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ కె.వి.జి.డి బాలాజీ అన్నారు. స్థానిక ట్రిపుల్‌ ఐటిలో ఈనెల 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న టెక్ని వెర్స్‌ ఫెస్ట్‌ను గురువారం ప్రారంభించారు. తొలుత 3డి ప్రింటింగ్‌ మెకానికల్‌, ఇఇఇ ఇవి, ఇసిఇకి సంబంధించిన విఎల్‌ఎస్‌ఐ బ్రాంచ్‌ వర్క్‌షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకు ళం, విజయనగరంలోని పలు కళాశాలల విద్యార్థులతో టెక్ని వెర్స్‌ ఫెస్ట్‌ నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో ఇవి వెహి కల్స్‌, డ్రోన్‌ సర్వేయింగ్‌, ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో, ఫోన్‌ ఫార్జ్‌, టెక్‌ అరేనా, టెక్‌ ఫేట్‌, వెబ్‌ డిజైన్‌ తోన్‌, కన్సలే హాక్‌, కాగానితో కోడ్‌, అన్వేషక, మైండ్‌ టెంటాకల్స్‌, ఎలక్ట్రిక్కింగ్‌, సర్క్యూరిటీరి, స్పార్క్‌ యువర్‌ బ్రెయిన్‌, డిజైన్‌ డేర్బైతో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఒఎస్‌డి సుధాకర్‌ బాబు, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహన్‌కృష్ణ, చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ అసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ రవి, ఫెస్ట్‌ కన్వీనర్‌ వాసు, కో కన్వీనర్‌ దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️