Sydney : చర్చిలో కత్తితో దాడి ..వరుసగా రెండో ఘటన

సిడ్నీ :   ఆస్ట్రేలియాలో దుండగులు వరుస దాడులకు తెగబడుతున్నారు. సిడ్నీ సెంట్రల్‌ బిజినెస్‌ జిల్లాకు పశ్చిమాన 30 కి.మీ దూరంలో ఉన్న వాక్లీలోని చర్చిలో దుండుగు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశామని, దర్యాప్తుకు సహకరిస్తున్నాడని అన్నారు.

చర్చిలో ప్రార్థన నిర్వహిస్తుండగా దాడి జరిగిందని,  బిషప్  సహా పలువురికి గాయాలయ్యాయని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారని, ప్రాణాపాయం లేదని అన్నారు.

గత శనివారం సిడ్నీ నగరంలో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్‌ సెంటర్‌లో ఓ దుండగుడి కత్తిపోట్లకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

➡️