కెజిబివి పార్ట్‌టైమ్‌ పిజిటిలకు రూ.26,795

Nov 30,2023 09:19 #Teachers, #Teachers Problems
kgbv salary hike

మిగులు పోస్టుల భర్తీకి చర్యలు
సమగ్ర శిక్ష డైరెక్టరు శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు (కెజిబివి)లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ పిజిటిల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం రూ.12 వేలుగా ఉన్న వేతనాన్ని రూ.26,795లకు పెంచుతున్నట్లు సమగ్ర శిక్ష డైరెక్టరు బి శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారానికి 24 పీరియడ్‌లకు మించి తీసుకుంటున్న వారికి మాత్రమేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన వేతనం డిసెంబరు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అలాగే కెజిబివిల్లో మిగిలిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్స్‌కు మరో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది మేలో 1,555 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 176 పోస్టులు భర్తీ కాలేదు. గతంలో వచ్చిన దరఖాస్తులు ఆధారంగా మెరిట్‌ జాబితాను ప్రకటించి డిసెంబరు 4లోపు భర్తీ చేయాలని తెలిపారు.

➡️