సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగించండి

  • సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం. ఏ గపూర్‌
  • అంగన్వాడీలకు అండగా ఉంటాం
  • సిపిఎం,టిడిపి,కాంగ్రెస్‌,సీపీఐ,జనసేనా,పార్టీల సంఘీభావం
  • మూడవరోజుకు కొనసాగిన అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్‌ : సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తమ సమ్మె ఆగదని అంగన్వాడీలులు తేల్చిచెప్పారు. కర్నూలు దర్నా చౌక్‌లో మూడు రోజులుగా జరుగుతున్న అంగన్వాడీలు సమ్మెకు గురువారం పలు రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపారు. ఎఐటియుసి నగర కార్యదర్శి జి చంద్రశేఖర్‌ సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె సుధాకరప్ప అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించడానికి సిఐటియు రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్‌, తెలుగుదేశం పార్టీ కర్నూలు ఇంచార్జ్‌ టీజీ భరత్‌ సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య సిపిఐ నగర కార్యదర్శి రామకష్ణారెడ్డి జనసేన పార్టీ నాయకురాలు రేఖా గౌడ్‌ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ మునెప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు జిల్లా నాయకులు యం.గోపాల్‌ శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పి నిర్మలమ్మ, టిఎన్‌ టి సి నాయకులు అశోక్‌ నరసింహులు న్యూ డెమోక్రసీ నాయకుల వెంకటేష్‌ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు సోమన్న ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కొందర శ్రీనివాసులు పిడిఎస్‌ యు రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ ఐ ఎఫ్‌ టు యు నాయకులు తిరుపాల్‌ వెంకటస్వామి అల్లప్ప శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీల సమ్మకు మద్దతు తెలియజేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులు మాజీ శాసనసభ్యులు యంఎ గఫూర్‌ మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని సమ్మెను విచ్చిన్నం చేయడానికి సచివాల సిబ్బంది ద్వారా ప్రయత్నం చేస్తున్నాడని అంగన్వాడీలపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. అంగన్వాడీలకి జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చినటువంటి తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు వేతనం అదనంగా ఇస్తానని చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీల కి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణా ఇస్తున్నారని ఆ రాష్ట్రాలలో మాదిరిగా జీతాలు పెంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అంగన్వాడి జీతాలు పెరిగేంతవరకు మీ ఉద్యమాన్ని కొనసాగించాలని దానికి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య మాట్లాడుతూ.. అంగన్వాడీ లకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని జగన్మోహన్‌ రెడ్డి ఇతరులను పెట్టి సమ్మెను విచ్చిన్నం చెయ్యాలని చూస్తే అన్ని విదాలుగా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు కార్యదర్శి టిజి భరత్‌ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పెంచిన 10000 వేతనమే అంగన్వాడీలకు ఇస్తున్నారు తప్ప అదనంగా ఏమీ పెంచలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కువ జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేసేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎఐయప్‌ నాయకులు వెంకటస్వామి అల్లప్ప తిరుపాల మాట్లాడుతూ.. బెదిరింపుల ద్వారా ఉద్యమాల్ని ఆపలేరని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యమానికి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి అంగన్వాడి నాయకురాలు రుక్మిణి, సునంద,చౌడేశ్వరి,సౌభాగ్య, కవిత, ప్రవీణమల్ల బాల దుర్గమ్మ. విజయ. నాగమణి.మల్లేశ్వరి సిఐటియు నగర కార్యవర్గ సభ్యుడు ఎస్‌ మహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

➡️