జంపింగ్‌లు…

Apr 8,2024 23:46
'ఆ గట్టునుంటావా ఓ మల్లన్న..ఈ

ప్రజాశక్తి – సామర్లకోట

‘ఆ గట్టునుంటావా ఓ మల్లన్న..ఈ గట్టునుంటావా.. ఓ మల్లన్న’ అంటూ రంగస్థలం సినిమాలో ఎన్నికల వ్యవహారంపై వచ్చిన పాట మాదిరిగా ఈ పూట ఆ గట్టు, రేపు మరో గట్టు అన్నట్లుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజ కీయ పార్టీల నాయకులు నిమిషాల్లో పార్టీ లు మారిపోతున్నారు. నిన్న ఒక పార్టీలో చేరిన వారు నేడు మరో పార్టీలో చేరుతూ ఇదే మాతీరున్నట్లుగా గోడ మీద పిల్లులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో పెద్దాపురం నియోజక వర్గంలో రాజకీయ పార్టీల తీరును ప్రజలు ముక్కు న వేలేసుకునే పరిస్థితి కన్పిస్తోంది. సామర్లకోట పట్టణంలో నాయకులు, కౌన్సిలర్‌లు, మాజీ కౌన్సి లర్‌లు, మాజీ వైస్‌ చైర్మన్‌లు అనే తేడా లేకుండా రోజుకో పార్టీ కండువాలు కప్పు కుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. గత కౌన్సిల్‌లో టిడిపిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన మన్యం పద్మావతి భర్త సీనియర్‌ కౌన్సిలర్‌ మన్యం చంద్రరావు గత నాలుగేళ్లపాటు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవన్నట్లుగా వ్యవ హరించారు. ఎన్నికల సమీపిస్తున్న తరు ణంలో ఒక్కసారిగా ఆయన వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అధికార పార్టీ ఆయనకు మున్సిపల్‌ కౌన్సిల్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా నియమించింది. అలాగే మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గోలి వెంకట అప్పా రావు చౌదరి (దొర బాబు) మొన్నటి వర కూ వైసిపిలో అసమ్మ తి వర్గ నాయకుడుగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసిపి పెద్దాపురం నియోజక వర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు బుజ్జగిం పుతో ఇటీవల వైసిపి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చలమల శెట్టి సునీల్‌ సమక్షంలో వైసిపికి మద్దతుగా కొనసాగు తానని ప్రకటించారు. అయితే దొరబాబుకు మద్దతుగా పని చేస్తానని ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన టిడిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి, ఎంఎల్‌ ఎ నిమ్మ కాయల చినరాజప్ప సమ క్షంలో టిడిపి కండువాను కప్పుకున్నారు. ఇదే క్రమంలో మరో మాజీ కౌన్సిలర్‌ ఎండ్రు సాయి వెంక టరమణ కొద్ది రోజుల క్రితం వైసిపిలో చేరా రు. అయితే నాలుగు రోజుల వ్యవధిలోనే ఆయన తిరిగి టిడిపికి జై కొట్టారు. గత నెల రోజులుగా ఒక పార్టీ నుంచి మరో పార్టీ లోకి..తిరిగి ఆ పార్టీ నుంచి సొంత గూటికి చేరుతున్న తంతు నేటికీ కొనసాగుతోంది. తాజాగా వైసిపికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్‌ పిల్లాడి సత్యవతి వైసిపికి షాక్‌ ఇచ్చి టిడిపిలో చేరారు. పోటాపోటీ గా చేరికలు..అధికార వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రజలను తమ తమ పార్టీల్లో పోటా పోటీగా పార్టీ కండువాలు కప్పుతూ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి 100 మంది, 200 మంది కార్య కర్తలు చేరుతు న్నట్లు మీడియాకు ప్రకటనలను విడుదల చేస్తున్నారు. సాధారణ ప్రజలు పలానా పార్టీ అని ముద్ర వేసు కునేందుకు సిద్ధపడరు. కానీ ప్రస్తుత ఎన్ని కల తంతు అంతా సాధారణ ప్రజలకు సైతం ఏదో ఒక పార్టీ ముద్ర వేసి పార్టీ కండు వాలు కప్పడం పరిపాటిగా మారిపోయింది.

➡️