విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్తపై న్యాయమూర్తి ఆగ్రహం

Dec 19,2023 15:25 #legal, #Vijayawada

అమరావతి: విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణలో శ్రీనివాసరెడ్డికి బదులు వేరొకరిని హాజరుపరిచినట్లు గుర్తించి న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు శ్రీనివాసరెడ్డి కోర్టులోనే ఉండాలని ఆదేశించారు. జడ్జి ఆదేశాలతో శ్రీనివాసరెడ్డి వెంటనే కోర్టుకు హాజరయ్యారు.

➡️