పార్లమెంటరీ సెక్యూరిటీ చీఫ్‌గా అనురాగ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ : ఐపిఎస్‌ అధికారి అనురాగ్‌ అగర్వాల్‌ పార్లమెంట్‌ సెక్యూరిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఆయనను మూడేళ్ల పాటు జాయింట్‌ సెక్రటరీ (సెక్యూరిటీ)గా నియమించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆయన నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. అనురాగ్‌ అగర్వాల్‌ అస్సాం-మేఘాలయకు చెందిన 1998 బ్యాచ్‌ అధికారి.

గతేడాది డిసెంబర్‌ 13న సందర్శకుల గ్యాలరీ నుండి ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ భద్రత పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నియామకం జరిగింది. జాయింట్‌ సెక్రటరీ రఘుబీర్‌ లాల్‌ తిరిగి తన కేడర్‌లోకి వెళ్లడంతో గతేడాది అక్టోబర్‌ 20 నుండి జెఎస్‌ (సెక్యూరిటీ) పోస్టు ఖాళీగా ఉంది.

➡️