క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలి

Mar 9,2024 00:19

ప్రజాశక్తి – బాపట్ల
విద్యార్థుల్లో క్రీడాశక్తిని వెలికి తీసి ప్రోత్సహించే దిశగా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ హై స్కూల్ హెచ్‌ఎం బి రాజశ్రీ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నెహ్రూ యువ కేంద్రం యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ ఆధ్వర్యంలో స్థానిక మునిసిపల్ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన పురుషుల వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలను ఆమె ప్రారంభించారు. పోటీల్లో మున్సిపల్ హైస్కూల్ వాలీబాల్ జట్టు విన్నర్స్‌గా, ముత్తాయపాలెం జెడ్‌పి హైస్కూలు విద్యార్ధులు రన్నర్స్‌గా నిలిచారని తెలిపారు. కబడ్డీలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ కిరణ్మయి దేవిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన క్రీడా పోటీలను నేషనల్ యూత్ వాలంటరీ శీలం త్రినేత్ర రెడ్డి, మున్సిపల్ హై స్కూల్ పిడి కత్తి శ్రీనివాసరావు, పూల నాగేశ్వరరావు పర్యవేక్షించారు.

➡️