ఆశాలను అవమానిస్తున్నారు…

Feb 12,2024 15:43 #Chittoor District
Insulting asha workers
  • వారిపై చర్యలు తీసుకోవాలి
  • చిత్తూరు హాస్పిటల్ లో హెచ్ఐవి టెస్టులు చేయాలి
  • నిరసనలో ఆదేశాలు డిమాండ్

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఆశా కార్మికులను అవమానకరంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆశా కార్మికులు హాస్పిటల్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంగా మాట్లాడుతూ చిత్తూరు చుట్టుపక్కల బంగారుపాలెం, తవణంపల్లి,ఐరాల,యాదగిరి తదితర మండలాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీ స్త్రీలను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్న ఆశాలను ఆస్పత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ బూతులు తిడుతున్న పరిస్థితి ఉంది. గర్భిణీ స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు చేస్తున్న ఆశాలకు సహకరించాల్సింది పోయి వారి మీదే దౌర్జన్యం దిగడం ఏమిటి అని ప్రశ్నించారు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత హెచ్ఐవి టెస్టులు చేసుకుంటారని మరి ఆ టెస్టులు చేయడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయా పీఎస్సీ పరిధిలో సౌకర్యాలు లేకనే చిత్తూరు ఆసుపత్రికి వస్తారని తెలిపారు. చిత్తూరు ఆసుపత్రి పూర్తిస్థాయిలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్లిపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు ప్రభుత్వం ఇస్తుందా అపోలో ఇస్తోతోందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వేతనాలు పొందుతూ ప్రభుత్వ సేవలు చేయకుండా దౌర్జన్యం చేయడం ఏమిటంటే ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఈ పరిస్థితి ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆసాల సమస్యలను పరిష్కారం చేయాలని చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా దౌర్జన్యాలకు చేస్తున్నారని వాటిని వెంటనే అరికట్టే విధంగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

పెరుగైన సౌకర్యాలు కల్పించాలి : వాడ గంగరాజు డిమాండ్

జిల్లా కేంద్రమైన చిత్తూరు ఆసుపత్రి కార్పొరేట్ శక్తులకు వెళ్లిన తర్వాత పేదలకు ఎలాంటి వైద్య సేవలు అందడం లేదని వెంటనే ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిరుపేదలైన ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఆశాల పరిస్థితి ఇలా వుంటే సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఆసుపత్రుల్లో సిబ్బంది ఆశా కార్మికులపై దురుసుగా వ్యవహరిస్తూ బూతులు తిడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారుల వెంటనే స్పందించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు

➡️