భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో…

Mar 23,2024 15:47 #Guntur District

నేటి యువకులు భారత రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి 
ప్రజాశక్తి-మంగళగిరి : భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో నేటి యువకులు భారత రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలని సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు అన్నారు. శనివారం మంగళగిరి ప్రజాసంఘాల కార్యాలయంలో అమర జీవులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం, సమగ్రత కోసం, సోషలిస్టు సమాజం కొరకు ఆనాడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులు ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. ప్రాణాలు త్యాగం చేసి సాధించిన స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం నేడు కార్పొరేట్ మతోన్మాదుల చేతులలో ధ్వంసం చేసే విధానంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన ఉందని అన్నారు. ఈ పరిపాలన వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మతోన్మాద శక్తులను ఓడించి, వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చంగయ్య, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, డివైఎఫ్ఐ నాయకులు ఎస్ గణేష్, ఎం నాగేశ్వరావు, జి మహేష్, రైతు సంఘం నాయకులు ఎం పకీరియా, వివిధ ప్రజా సంఘాల నాయకులు జి వెంకయ్య, ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️