హృతిక్‌ రోషన్‌కు గాయాలు

Feb 15,2024 13:45

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృత్రిక్‌ రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా ఆయన నడుముకు బెల్ట్‌ పెట్టుకుని, క్రచెస్‌ సాయంతో నిలుచున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్‌, వీల్‌చైర్‌ అవసరమొచ్చింది? ఆ సమయంలో మీరెలా ఫీలయ్యారు అంటూ ప్రశ్నించారు. అయితే తనకు ఎందుకు గాయాలయ్యాయో హృతిక్‌ తన పోస్టులో వివరించలేదు. ప్రస్తుతం ఆయన తనకు తగిలిన గాయం నుంచి కోలుకుంటున్నానని హృతిక్‌ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అయింది. దీంతో వరుణ్‌ధావన్‌, టైగర్‌ ష్రాఫ్‌ వంటి పలువురు నటులు హృతిక్‌ త్వరగా కోలుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నారు.

హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి ‘వార్‌ 2’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే హృత్రిక్‌ కాలికి గాయమవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదాపడింది. బహుశా ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం కావొచ్చని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ ఏడాది జనవరి 25న హృతిక్‌ ‘ఫైటర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టింది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

➡️