టెన్త్ పరీక్షల్లో మౌలిక వసతులు కల్పించాలి

Mar 16,2024 15:16 #Anantapuram District
  • ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పరీక్షా కేంద్రంలోని రూమ్స్ లో ఫ్యాన్లు ఏర్పాట్లు చేయాలి
  • పరీక్ష కేంద్రాలలో వెలుతురు లేని గదులలో లైట్లు ఏర్పాటు చేయాలి
  • ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర మెడికల్ ఫస్ట్ ఎయిడ్ ను ఏర్పాటు చేయాలి
  • ఫీజు పేరుతో హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
  • ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి

ప్రజాశక్తి-హిందూపురం : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 115 పరీక్ష కేంద్రాలలో 22002 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయుచున్నారు. ప్రభుత్వం నాడు నేడు పథకాల కింద ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని గొప్పలు చెబుతున్నారు. కానీ పరీక్షలు రాయటానికి వెళ్తున్న విద్యార్థులకు కనీసం పరీక్ష కేంద్రాలలో కొన్ని విద్యాసంస్థలలో ఫ్యాన్లు కూడా లేనటువంటి ప్రసితి ఈ జిల్లాలో ఉందన్నారు. అదేవిధంగా బెంచీలు కూడా చాలా చిన్నగా ఉండడం వలన విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో వెలుతురు లేని గదులు ఏవైనా ఉంటే తక్షణమే ప్రతి గదిలోను లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఒక మెడికల్ ఫస్ట్ ఎయిడ్ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర మంచినీటి సదుపాయం కచ్చితంగా కల్పించాలన్నారు. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలోనూ బెంచీలు లైట్లు ఫ్యాన్లు మంచినీటి సౌకర్యం ఉండేటట్టు చూడాలన్నారు. ప్రతి విద్యార్థి కూడా బెంజి పైన కూర్చొని పరీక్ష రాయాలని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు ఇంకా పెండింగ్ ఉన్నాయని హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులను భయపెడుతున్నారని తెలిపారు. అటువంటి విద్యా సంస్థలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే డీఈఓ ఏ ఒక్క విద్యార్థికి కూడా హాల్ టికెట్ పెండింగ్ పెట్టకుండా ఈరోజు సాయంత్రం కల్లా హాల్ టికెట్లు విద్యార్థులకు అందజేయాలని పేర్కొన్నారు. హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా విద్యాసంస్థల ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్ తరుణ్ హర్ష కుమార్ పవన్ భగత్ మహేష్ పాల్గొన్నారు.

➡️