న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం : చంద్రచూడ్‌

  • భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌
  • ఘనంగా సుప్రీంకోర్టు వజ్రోత్సవం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవడానికి ప్రస్తుత రాజ్యాంగ భద్రతలు సరిపోవని సిజెఐ డివై చంద్రచూడ్‌ నొక్కి చెప్పారు. ఆదివారం నాడిక్కడ నిర్వహించిన సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, నేడు దేశానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ అవసరం చాలా ఉందని అన్నారు. న్యాయవ్యవస్థలో ఎవరో కొందరు చేసిన తప్పిదాలకు అందరినీ నిందించడం సరికాదని, పక్షపాతం లేని న్యాయమూర్తులు కూడా ఉంటారని ఆయన అన్నారు. ”స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం రాజ్యాంగం నిర్ణీత పదవీ విరమణ వయస్సు, న్యాయమూర్తుల నియామకం వంటి వాటికి సంబంధించి రాజ్యాంగం కొన్ని సంస్థాగత రక్షణలను కల్పించింది. అయితే, స్వతంత్ర న్యాయవ్యవస్థను నిర్ధారించడానికి ఈ రాజ్యాంగ రక్షణలు సరిపోవు” అని ఆయన పేర్కొన్నారు.ఆత్మ పరిశీలన చేసుకోవాలిప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సిజెఐ చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు. న్యాయస్థానాల లోపల, వెలుపల రాజ్యాంగాన్ని సమర్థించే నిబద్ధతను పునరుద్ధరించాలని కోరారు. కేసుల బ్యాక్‌లాగ్‌, కాలం చెల్లిన విధానాలు, వాయిదాల సంస్కృతి సహా న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ రోజుల్లో వివాదాలు చాలా క్లిష్టంగా మారాయని, వాటి పరిష్కారం గోతులుగా ఉండదని పేర్కొన్నారు. అదే విధంగా, రాజ్యాంగాన్ని, చట్టాన్ని సమర్థించే ప్రధాన విధులను అత్యున్నత న్యాయస్థానం మరచిపోదని ఆయన అన్నారు. లింగం, అంగ వైకల్యం, జాతి, కులం, లైంగికతపై సామాజిక పరిస్థితులతో వైఖరులను తెలుసుకోవడానికి న్యాయమూర్తులందరికీ అవగాహన కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాల జరుగుతున్నాయని అన్నారు. న్యాయం చేయాలనే కోరికే అందరినీ కలుపుతుంది”ఆలోచనల విశ్లేషణను స్వీకరించే సామర్థ్యమే మన బహు స్వభావ బలం. మన కోర్టులోని విశ్లేషణ వైవిధ్యాన్ని ఒకచోట చేర్చుతుంది. అదే న్యాయస్థానం నిజమైన సామాజిక ధర్మం, సామాజిక మనస్సాక్షి. న్యాయస్థానం ఒక ఆత్మగా ఉద్భవించింది. ఇది మన ప్రజలకు న్యాయం జరగాలనే మా కోరికలో న్యాయమూర్తులు, న్యాయవాదులను కలుపుతుంది” అని అన్నారు. కేసుల పెండింగ్‌లు పెరగడం, చాలా మందికి న్యాయం చేయడంలో ఇబ్బందులను కూడా వివరించారు. ”కేసుల పెండింగ్‌తో కోర్టు అపారమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం, మొత్తం 65,915 నమోదైన కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. నిర్ణయం తీసుకునే విధానంలో సమూలమైన మార్పు ఉండాలి. ప్రతి వ్యక్తి కేసులో న్యాయం జరగాలనే మా కోరిక” అని అన్నారు. వాదనల నిడివిని అరికట్టేందుకు సంస్కరణలు అవసరమని, సుదీర్ఘ వాదనలు న్యాయపరమైన ఫలితాలలో అంతులేని జాప్యానికి దారి తీస్తాయని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించే అంశాల ఎంపికకు పున్ణపరిశీలన అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఒత్తిడి సమస్యలను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు రూపొందించిన గొప్ప న్యాయశాస్త్రం, ఈ నిర్ణయాలను రూపొందించే న్యాయమూర్తుల నైపుణ్యం పనిగా పరిగణించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎకె సిక్రి, జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అజయ్ రస్తోగి, అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆదిష్‌ సి అగర్వాలా తదితరులు పాల్గొన్నారు.ఈజ్‌ ఆఫ్‌ జస్టిస్‌ పౌరుల హక్కుసుప్రీం కోర్టు వజ్రోత్సవంలో ప్రధాని మోడీసులభతరమైన న్యాయం (ఈజ్‌ ఆఫ్‌ జస్టిస్‌) ప్రతి పౌరుడి హక్కు అని, దీనికి సుప్రీంకోర్టు ప్రధాన మార్గంగా వ్యవహరిస్తుం దని అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు వజ్రోత్సవాలను ఆయన తొలుత ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మట్లాడుతూ, కాలం చెల్లిన వలస నేర చట్టాలను రద్దు చేయడంలోనూ, భారతీయ నాగ్రిక్‌ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం వంటి కొత్త చట్టాలను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ చొరవ తీసుకుందని అన్నారు. ఈ ముఖ్యమైన మార్పులతో దేశంలోని చట్టపర మైన, పోలీసింగ్‌, పరిశోధనాత్మక వ్యవస్థలు కొత్త శకంలోకి ప్రవేశించాయని అన్నారు. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించడంలో సుప్రీంరాజ్యాంగ నిర్మాతలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి సూత్రాలతో కూడిన స్వతంత్ర దేశం గురించి కలలు కన్నారని అన్నారు. ఈ సూత్రాలను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు నిరంతరం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ అన్నారు. సుప్రీంకోర్టు భవన సముదాయం విస్తరణకు రూ.800 కోట్లకు గతవారం ఆమోదం తెలిపిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. రాబోయే 25 ఏళ్లలో దేశ భవిష్యత్తును రూపొందించడంలో సుప్రీంకోర్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో మొదటి మహిళా న్యాయమూర్తి అయిన ఎం ఫాతిమా బీవికి మరణానంతరం పద్మభూషణ్‌ ప్రదానం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.

➡️