ఎన్నికల ప్రణాళికలో మా సమస్యల్ని చేర్చండి : కల్లుగీత కార్మికుల డిమాండ్‌

ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : కల్లుగీత కార్మికుల సమస్యలను ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుత్తిగ నరసింహమూర్తి డిమాండ్‌ చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా … అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల ఓట్లు కోసం వాగ్దానాలు చేయకుండా గీత వఅత్తిని కాపాడే విధంగా నిర్ధిష్టంగా అమలు చేసే విధంగా ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని తెలిపారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం వాక రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ … ఆంధ్రరాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో గీత కార్మికులను మోసం చేస్తున్నట్లుగా దేశంలో ఏ రాష్ట్రంలోను చేసినట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అంటూ గీత కార్మికులని గత ప్రభుత్వం ప్రస్తుత వైఎస్సార్‌ ప్రభుత్వం ఓట్లు బ్యాంకుగా వాడుకొని కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారని దుయ్యబట్టారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రతి యేటా రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని, ఎక్స్‌ గ్రేషియా రూ.10 లక్షలు ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రమాదం జరిగిన నెల రోజులలో ఇవ్వాలని, పెన్షన్‌ రూ.5 వేలకు పెంచాలని, గీత కార్మికుల బిడ్డలకు పెళ్లి కానుక లక్ష రూపాయలకు పెంచి పెళ్లయిన నెల రోజులలో ఇవ్వాలని, కల్లు గీత సొసైటీలకు 40 శాతం మద్యం షాపులు కేటాయించాలని, తాటిచెట్టుకు 10 రూపాయలు చొప్పున కిస్టీలు కట్టించుకోవడం రసాయనాలతో తయారు చేసిన బ్రాంది, విస్కీలతో కల్లును పోల్చకుండా శీతల పానీయంగా అభివృద్ధి చేయడం, వఅత్తిలో చనిపోయినవారికి దహన సంస్కారాలకు రూ.30 వేలు, దెబ్బలు తగిలినవారికి వైద్యం ఖర్చులకు రూ.25 వేలు కార్పొరేషన్‌ నుండి ఇవ్వడం, పేద గీత కార్మికులకు ఉచితంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టించి ఇవ్వాలని, కేరళ రాష్ట్రంలోలాగా గీత వఅతికి రక్షణ కల్పించి ఉపాధి గ్యారంటీ ఇవ్వడం, ఎక్సయిజ్‌ డిపార్ట్మెంట్‌ గతంలోలాగా ఒకటిగానే ఉంచడం, బోగస్‌ కులాల కార్పొరేషన్‌ తక్షణం రద్దు చేయడం కల్లు ప్రభుత్వమే మార్కెట్‌ సౌకర్యంతోపాటు పై సమస్యలు పరిష్కరించడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని తీర్మానించారు. ఈ సమావేశంలో యర్రా దేముడు, కామున ముని స్వామి, కుడుపూడి పెద్దిరాజు, కడలి పాండు, కోమటి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️