ప్రయివేటు పాఠశాలలో మేం పరీక్ష వ్రాయం…

Mar 1,2024 14:57 #Protest, #SFI

మా పాఠశాలలో పరీక్ష కేంద్రం తొలగించొద్దు‌‌‌…
రోడ్డుపై పూర్వ విధ్యార్థుల ఆద్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విధ్యార్థుల ధర్నా‌‌…
విధ్యార్థుల ఆందోళనకు ఎస్ఎఫ్ఐ మద్దతు‌.‌.
ప్రజాశక్తి-చిలమత్తూరు : ప్రభుత్వ పాఠశాలలోనే పది పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విధ్యార్థులు పాఠశాల పూర్వవిధ్యార్థుల ఆద్వర్యంలో పాఠశాల ముందు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. 60 ఏళ్లుగా పరిక్షా కేంద్రానికి పనికొచ్చిన పాఠశాల ఈ ఏడాది ఎందుకు పనికి రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బేటాయించిన విధ్యార్థులు మా పాఠశాలలో పది పరిక్ష కేంద్రాన్ని ప్రయివేటు పాఠశాలకు తరలించొద్దని, పరీక్ష కేంద్రం ప్రయివేటుకు తరలింపులో కుట్ర ఉందని నినాదాలు చేశారు‌. ప్రభుత్వ పాఠశాలను నిర్విర్యం చేసేందుకు పాఠశాల హెచ్ ఎం, ఎంఈఓ సహకరిస్తున్నారని ఆరోపించారు‌. గుట్టు చప్పుడు కాకుండా పరిక్ష కేంద్రం మార్పుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ఈ మేరకు పూర్వ విద్యార్థులు శివకుమార్, బాలాజీ, ఎస్ ఎఫ్ ఐ బాబావలీలు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద ఉన్న మా ఊరి పాఠశాల మండల కేంద్రంలో బస్టాండ్, ఆసుపత్రి అన్నింటికి సమీపంలో ఉందని అన్నారు‌. నాడు నేడు, నాబర్డు క్రింద కోట్ల రూపాయలు ప్రభుత్వం వేచించి బహిళంతస్తుల బిల్డింగ్ లు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు. ఇటు స్వచ్చంద సంస్థలైన ఆర్డీటి, సెహగల్ ఫౌండేషన్ లు గదులు నిర్మాణంతో పాటు మౌలికవసతులు కల్పించారని అన్నారు. చుట్టు ఎత్తైన ప్రహారి ఉంది త్రాగునీరు ఉంది‌. మంచి చెట్లు చక్కటి వాతావరణం, ఎలక్ట్రసిటీ ప్యానులు అన్నీ ఉన్నాయని అన్నారు. పాఠశాలలో‌ ఉన్న పాత డెస్క్ లను ఏం చేశారో తెలియదు గాని డెస్క్ లు లేవని కేంద్రం మార్చామని విధ్యాశాఖ అదికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత 12 ఏళ్లుగా వేరే చోట నుండి సరిపడా డెస్క్ లు వేసి పరిక్షలు నిర్వహణ జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు రాని సమస్య ఈ ఏడాది వచ్చిందని చెప్పడంలో కుట్ర ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విధ్యార్థుల భవిష్యత్తును ప్రయివేటు పాఠశాలకు తాకట్టు పెట్టారా అని ఎంఈఓ ని నిలదీశారు. జిల్లాలోనే అన్ని హంగులు అభివృద్ధి ఉన్న పాఠశాలగా ఈ పాఠశాలకు అవార్డు వచ్చిందని అలాంటి పాఠశాలలో పరిక్ష కేంద్రం తీసేయడం దారుణం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పరిక్ష కేంద్రం తీసేసి ఊరి దూరంగా ఉన్న ప్రయివేటు పాఠశాలకు ఎలా పరీక్ష కేంద్రం ఇచ్చారని నిలదీశారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో పరిక్ష కేంద్రం ఎప్పుడూ మారలేదు. ఈ ఏడాది ఎందుకు మారుస్తారు అని ప్రశ్నించారు‌. విధ్యార్థులు రోడ్డుపై ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన విద్యార్థులు వినలేదు. ఘటన స్థలానికి చేరుకున్న ఎంఈఓ పరిక్ష కేంద్రం ఏర్పాటుకు ఎలాంటి సమస్య లేదని డెస్క్ లు లేవనే మార్చామని సమాదానం ఇవ్వగా పూర్వ విద్యార్థులు దానిని తిప్పి కొట్టారు. పాఠశాలలోని 200 డెస్క్ లు ఏమయ్యాయి అన్నారు. గతేడాది లేవు మరి పరీక్ష ఎలా పెట్టారని ‌నిలదీశారు. ఇతర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న డెస్క్ లను తీసుకొచ్చి 12 ఏళ్లుగా పరీక్షలు నిర్వహణ చేశారు. ఈ ఏడాది అది కారణంగా చెప్పడం విడ్డూరంగా ఉందని అనడంతో కంగుతిన్న ఎంఈఓ సల్మాన్ రాజ్ పరిక్ష కేంద్రం ఏర్పాటుకు డీవైఈఓ డీఈఓ లతో చర్చించి రెండు రోజులలో పూర్తీ చేస్తానని హామి ఇవ్వడంతో విధ్యార్థులు ధర్నా విరమింపచేశారు. శనివారంలోపు ఏమి తేల్చకపోతే సోమవారం నుండి ఆందోళన ఉదృతం చేస్తామని పూర్వ విద్యార్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, గంగరాజు, బాలునాయక్, గంగప్ప, రామప్ప, జయరాం, నరేంద్ర, క్రిష్ణ మూర్తీ, సోము, ప్రజా సంఘాల నాయకులు ప్రవీణ్  కుమార్, చందు, బ్రహ్మానందరెడ్డి, సదాశివరెడ్డి, పది విధ్యార్థిని విధ్యార్థులు, పాఠశాల విధ్యార్థులు,పూర్వ విధ్యార్థులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️