తెలంగాణలో… నేటి నుండి ఒంటిపూట బడులు

తెలంగాణ : రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతోన్న వేళ …. నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని కమిషనర్‌ ఆదేశించారు. లేకపోతే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని, 12.30 గంటలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని కమిషనర్‌ సూచించారు.

➡️