స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయండి : సిఐటియు

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్‌వి గోపాలన్‌ విమర్శించారు. ఉండి మండలంలో మంగళవారం సాయంత్రం జిల్లా ప్రచార యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండి మెయిన్‌ సెంటర్లో నిర్వహించిన యాత్రలో సిఐటియు నాయకులు జక్కం సత్యనారాయణ, ఆంజనేయులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించడంపై స్వామినాథన్‌ కుటుంబం విమర్శలు గుప్పించడం శుభ సూచికం అన్నారు. రైతాంగ, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మార్చి14వ తేదీన రైతు సంఘాల పిలుపు మేరకు ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌, నాయకులు గొర్ల రామకృష్ణ, మాదాసి గోపి, వీరవల్లి మాధవరావు, కురిటి సోమేశ్వరరావు, మజ్జి నాగేశ్వరరావు, రామకూరి వెంకట రత్నం, చిట్టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు.

➡️