హింసించిన పోలీస్‌ అధికారులను వెంటనే అరెస్టు చేయండి

Feb 29,2024 08:32 #cpm, #West Bengal
Immediately arrest the police officers who tortured
  • సందేశ్‌ ఖలీ సిపిఐ(ఎం) నాయకుణ్ణిపై హింసపై బెంగాల్‌ ప్రభుత్వంపై సీరియస్‌ 
  •  కామ్రేడ్‌ సర్దార్‌కు బేషరతుగా బెయిలు
  • కలకత్తా హైకోర్టు ఆదేశం 
  • తీర్పు పట్ల సిపిఐ(ఎం) నేత సలీం హర్షం

కొల్‌కతా: సందేశ్‌ఖలీ నియోజకవర్గానికి చెందిన సిపిఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే నిరపడా సర్దార్‌కు కలకత్తా హైకోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. ఉత్తర పరగణాల జిల్లా లోని సందేశ్‌ఖలిలో అల్లర్లకు కారణమయ్యారని ఆరోపిస్తూ ఈ నెల 11న సర్దార్‌పై బెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించింది. గ్యాంగ్‌ రేప్‌ కేసులో ప్రస్తుతం కస్టడీలో ఉన్న తృణమూల్‌ నాయకుడు భాను మండల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిపిఐ(ఎం) నాయకునిపై కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సిపిఐ(ఎం) నాయకుణ్ణి అమానుషంగా కొట్టడం, హింసించడం వంటవి చేయడం చాలా సిగ్గు చేటు అని వ్యాఖ్యానించింది. 17 రోజులుగా ఆయనను హింసించిన పోలీస్‌ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. సర్దార్‌పై ఫిర్యాదు ఫిబ్రవరి 10న రాగా, అంతకు ముందే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను ఎలా పెట్టారని కోర్టు ప్రశ్నించింది. సందేశ్‌ఖలీ ప్రజల హక్కుల కోసం సాహసోపేతంగా పోరాడిన కామ్రేడ్‌ సర్దార్‌కు మేము విప్లవాభినందనలు తెలియజేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. సిపిఐ (ఎం) మాజీ ఎమ్మెల్యేపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసిన రాష్ట్ర పోలీసులను, టిఎంసి నాయకత్వాన్ని కోర్టు తీవ్రంగా మందలించింది.కామ్రేడ్‌ సర్దార్‌కు బేషరతుగా బెయిలు మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. సర్దార్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం స్వాగతించారు. హైకోర్టు తీర్పు అనంతరం సలీం మాట్లాడుతూ, సర్దార్‌పై తప్పుడు కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు చేయకముందే సర్దార్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు, పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. ఈ పోలీసు అధికారులందరినీ ఎందుకు అరెస్టు చేయరు అని జస్టిస్‌ ప్రశ్న లేవనెత్తారు. దీనికి తృణమూల్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తణమూల్‌ నేతలకు, మంత్రుల కు, దొంగలకు, దొంగలకు పోలీసులు కాపలా కాస్తూ పడవ, లాంచీల్లో తీసుకెళ్తున్నారు, మరో వైపు ప్రజల హక్కులను కాపాడడం కోసం ఆందోళనలు, నిరసనలు చేస్తున్న వారిని అరెస్టు చేసిజైలులో పెడుతున్నారని సలీం విమర్శించారు.

➡️