తక్షణమే కాల్పుల విరమణ

Mar 25,2024 23:50 #ceasefire, #Israel and Hamas, #War
  •  మొదటి సారి తీర్మానం ఆమోదించిన ఐరాస భద్రతా మండలి
  •  ఓటింగ్‌కు అమెరికా గైర్హాజరు

ఐక్యరాజ్య సమితి : ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగా లని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానం చేసింది. కాల్పుల విరమణకు సంబంఢించి మండలి ఇటువంటి తీర్మానం ఆమోదించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు కాల్పుల విరమణ తీర్మానాలను తెచ్చినప్పుడల్లా వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్న అమెరికా ఈసారి ఓటింగ్‌కు గైర్హాజరు కాగా, మండలిలోని మిగతా 14 దేశాలు తీర్మానానికి అనుకూలం గా ఓటు వేశాయి. భద్రతా మండలిలోని ఎన్నికైన పది దేశాలు కలసికట్టుగా ఈ తీర్మానాన్ని ప్రతిపా దించాయి. రంజాన్‌ మాసంలో రక్తపాతం సాగిస్తున్న ఇజ్రాయిల్‌ చర్యను అవి నిరసించా యి.కాల్పుల విరమణపై అస్పష్టమైన తీర్మానాన్ని అమెరికా గత వారం తీసుకొచ్చిన ప్పుడు రష్యా, చైనా వీటో చేసిన సంగతి తెలిసిందే. గాజాకు తక్షణమే మానవతా సాయా న్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను ఈ తీర్మానం నొక్కిచెప్పింది. అమెరికా గనుక ఈ తీర్మానాన్ని అడ్డుకోకపోతే వాషింగ్టన్‌కు పంపాల్సిన తన ప్రతినిధి బృందాన్ని నిలిపేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. ఇప్పటివరకు గాజాపై రూపొందించిన మూడు ముసాయిదా తీర్మానాలను అమెరికా వీటో చేసింది.

➡️