ఇళయరాజాను జీవితంలో మర్చిపోను

‘చిన్నతనంలో సంగీతం అంటే ఏమిటో తెలియనప్పుడే ఇళయరాజా సంగీతం వింటుంటే అద్భుతంగా అనిపించేది. పరీక్షలకు చదువుకునే సమయంలోనూ ఆయన పాటలు వింటూ ఉండేవాడిని. ఆయన సంగీతంనాకు ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే నేను సంగీత దర్శకుడిగా ఎదిగాను. సంగీత దర్శకుడయ్యాక నా స్టూడియోలో ఇళయరాజా పెద్ద ఫొటో పెట్టుకున్నాను. ఆయన ఒక్కరోజైనా నా స్టూడియోకు వచ్చి ఇక్కడ నిల్చుంటే కలిసి ఫొటో దిగాలని కలలు కన్నాను. ఈ రోజు నా కల నెరవేరింది. దీనిని జీవితంలో మర్చిపోలేను’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన స్టూడియోను తెలుగు సంగీత దర్శకుల్లో అగ్రగామిగా ఉన్న ఇళయరాజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆనందంతో దేవిశ్రీప్రసాద్‌ తన మనసులోని మాటలను సోషల్‌మీడియాలో ప్రస్తావించారు.

➡️