చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు. అజిత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని గత రెండు రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అజిత్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ వచ్చింది. అజిత్ ప్రస్తుతం చెవి నొప్పితో బాధపడుతుండగా.. గత గురువారం డాక్టర్లు సర్జరీ చేశారు. దీంతో అజిత్ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక త్వరలోనే విదాముయార్చి సినిమా షూటింగ్ కోసం అజర్బైజాన్కు బయలు దేరనున్నట్లు తెలుస్తుంది.