ఆదుకున్న తిలక్‌ వర్మ

Apr 22,2024 21:57 #2024, #Cricket, #IPL, #mumbai indians, #Sports
  • ముంబయి ఇండియన్స్‌ 179/9
  • సందీప్‌ శర్మకు ఐదు వికెట్లు

జైపూర్‌: సీజన్‌-17 ఐపిఎల్‌లో హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ తొలిసారి అర్ధసెంచరీతో కదం తొక్కాడు. టాస్‌ గెలిచిన హార్దిక్‌ పాండ్యా తొలిగా బ్యాటింగ్‌ తీసుకున్నాడు. తొలి ఓవర్‌ వేసిన బౌల్ట్‌ ఆఖరి బంతికి రోహిత్‌ శర్మ(6)ను ఔట్‌ చేసి రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత బంతి అందుకున్న సందీప్‌ శర్మ డేంజరస్‌ ఇషాన్‌ కిషన్‌(0), సూర్యకుమార్‌ యాదవ్‌(10)లను వెనక్కి పంపి ముంబయిని కష్టాల్లోకి నెట్టాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబయిని తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ(65), నేహల్‌ వధేరా(49) ఆదుకున్నారు. మొదట్లో ఆచితూచి ఆడి ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయారు. అయితే.. సందీప్‌ ఊరించే బంతితో వధేరాను ఔట్‌ చేసి పరుగుల ప్రవాహానికి తెరదించాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్‌ పాండ్యా(10), టిమ్‌ డెవిడ్‌(3)లు నిరాశపరచడంతో ముంబై సంజూ సేనకు మోస్తరు టార్గెట్‌ నిర్దేశించగలిగింది. రాజస్థాన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ షాట్లతో విరుచుకుపడుతూ ఐదో వికెట్‌కు 99పరుగులు జోడించారు. అయితే.. చివరి మూడు ఓవర్లలో రాజస్థాన్‌ బౌలర్లు ముంబై జోరుకు ముకుతాడు వేశారు. పేసర్‌ సందీప్‌ శర్మ(5/18) సూపర్‌ స్పెల్‌తో కట్టడి చేశాడు. దాంతో, ముంబయి 179 పరుగులకే పరిమితమైంది.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి)సంజు (బి)బౌల్ట్‌ 6, ఇషాన్‌ (సి)సంజు (బి)సందీప్‌ 0, సూర్యకుమార్‌ (సి)పోవెల్‌ (బి)సందీప్‌ శర్మ 10, తిలక్‌ వర్మ (సి)పోవెల్‌ (బి)సందీప్‌ శర్మ 65, నబి (సి అండ్‌ బి) చాహల్‌ 23, వధేరా (సి)సందీప్‌ (బి)బౌల్ట్‌ 49, హార్దిక్‌ పాండ్యా (ఎల్‌బి) ఆవేశ్‌ ఖాన్‌ 10, టిమ్‌ డేవిడ్‌ (సి)రియాన్‌ పరాగ్‌ (బి)సందీప్‌ శర్మ 3, కోర్ట్జే (సి)హెట్‌మైర్‌ (బి)సందీప్‌ శర్మ 0, చావ్లా (నాటౌట్‌) 1, బుమ్రా (నాటౌట్‌) 2, అదనం 10. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 179పరుగులు.
వికెట్ల పతనం: 1/6, 2/6, 3/20, 4/52, 5/151, 6/170, 7/176, 8/176, 9/177
బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-32-2, సందీప్‌ శర్మ 4-0-18-5, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-49-1, అశ్విన్‌ 4-0-31-0, చాహల్‌ 4-0-48-1.

➡️