సాయం చేయండి’

Dec 7,2023 19:10 #movie, #vijay

మిగ్‌జాం తుపాను కారణంగా ఎంతో మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు, ఆహారం వంటి కనీస వసతులు లేక వేలాది మంది నానాఅవస్థలు పడుతున్నారు. వరదల్లో ఎంతోమంది చిక్కుకున్నారు. తమను రక్షించాలని కోరుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారి ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో నా అభిమానులంతా స్వచ్ఛందంగా పాల్గనాలని కోరుతున్నా’ అని విజయ్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పటికే తుపాను బాధితుల సహాయార్థం సూర్య, కార్తీ రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే యువ హీరో హరీశ్‌ కల్యాణ్‌ తనవంతుగా రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.

➡️