శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాలు

Jan 23,2024 13:46 #health, #​Millets

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో తృణధాన్యాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలతో చేసే పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

రాగులు : రాగుల్లో ఎక్కువ క్యాల్షియం, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో అజీర్తి సమస్యలతో ఎక్కువమంది బాధపడతారు. అలాంటివారు రాగితో చేసే రోటీలు, గంజి, సూప్స్‌ వంటివి తీసుకుంటే మంచిది.

సజ్జలు : సజ్జల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే మెగ్నీషియం కూడా ఎక్కువే ఉంటుంది. చలికాలంలో సజ్జలతో తయారుచేసిన రోటీలు, కిచిడి వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. జొన్నలు : జొన్నల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో జొన్నలతో చేసే రొట్టెలు, ఉప్మా, జావ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇవి రిగనిరోధకశక్తిని పెంచుతాయి. ఇవే కాకుండా కొర్రలు వంటివి కూడా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

➡️