అలాంటి క్లైమాక్స్‌ చూసి ఉండరు : హీరో తేజ్‌ బొమ్మదేవర

Nov 22,2023 19:14 #chey, #movie, #Naga Chaitanya

మాధవే మధు సూదన సినిమా క్లైమాక్స్‌ కాస్త డిపరెంట్‌గా ఉంటుందని, ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూసి ఉండబోరని హీరో తేజ్‌ బమ్మదేవర వెల్లడించారు. తేజ్‌ బొమ్మదేవర, రిషికి లక్రే జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్రరావు. ఈ మూవీని బమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. శుక్రవారంనాడు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో తేజ్‌ బొమ్మదేవర మీడియాతో ముచ్చటించారు. ‘బీబీఏ కంప్లీట్‌ చేశాను. విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేద్దామని అనుకున్నా. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. ఆ టైంలోనే మా నాన్న ఈ కథను రెడీ చేసుకున్నారు. ఆయనతో పాటు నేను కూడా ట్రావెల్‌ చేశాను. ఎంతో మంది వద్దకు వెళ్లి కథ చెప్పాం. కానీ సెట్‌ అవ్వలేదు. చివరకు మా నాన్న నన్నే అడిగారు. నటనలో శిక్షణ తీసుకుని ఇందులో హీరోగా నటించాను. ప్రీ క్లైమాక్స్‌ షఉట్‌ కోసం చాలా ప్రిపేర్‌ అయ్యాను. ఆ సీన్‌ చేసిన తరువాత నాకు చాలా కాన్ఫిడెన్స్‌ పెరిగింది. మహేష్‌ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇంటెన్స్‌ యాక్టింగ్‌ అంటే నాకు విపరీతంగా ఇష్టం. నాగార్జున అంటే మాకు గౌరవం. వారి వల్లే మేం ఈ స్థాయిలో ఉన్నాం’ అని వివరించారు. .

➡️