హర్మన్‌ప్రీత్‌ సేన రికార్డు గెలుపు

Dec 17,2023 11:56 #Sports
  • ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌లో 347 పరుగుల తేడాతో విజయం

ముంబయి : ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో గెలిచి రికార్డు నెలకొల్పింది. మహిళల క్రికెట్‌ టెస్ట్‌ చరిత్రలో ఓ జట్టు ఇన్ని పరుగుల తేడాతో గెలుపొందడం ఇదే ప్రథమం. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 6వికెట్ల నష్టానికి 186పరుగులతో శనివారం రెండో ఇన్నింగ్స్‌కొనసాగించిన భారత్‌.. అదే స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. దీంతో 479పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 131పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లం డ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌట్‌ కాగా.. భారతజట్టు తొలి ఇన్నింగ్స్‌లో 438పరుగుల భారీ స్కోర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీప్తిశర్మ మరోసారి సత్తా చాటి 4 వికెట్లు తీయగా, పేసర్‌ పూజా వస్త్రాకర్‌ 3, రాజేశ్వరి గైక్వాడ్‌ 2, రేణుకా సింగ్‌ 1 వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ హీదర్‌ నైట్‌ అత్యధికంగా 21 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దీప్తి శర్మకు లభించింది.

స్కోర్‌బోర్డు…

భారత్‌ మహిళల తొలి ఇన్నింగ్స్‌ : 428ఇంగ్లండ్‌ మహిళల తొలి ఇన్నింగ్స్‌: 136భారత్‌ మహిళల రెండో ఇన్నింగ్స్‌: 186/6ఇంగ్లండ్‌

మహిళల రెండో ఇన్నింగ్స్‌ : డంక్లే (సి)హర్లిన్‌ డియోల్‌ (బి)పూజ వస్త్రాకర్‌ 15, బ్యుమౌంట్‌ (బి)రేణుక సింగ్‌ 17, హీథర్‌ నైట్‌ (సి)యాస్టికా భాటియా (బి)పూజ వస్త్రాకర్‌ 21, స్కీవర్‌ బ్రంట్‌ (బి)పూజ వస్త్రాకర్‌ 0, డానిల్లే వాట్‌ (సి)స్నేV్‌ా రాణా (బి)దీప్తి శర్మ 12, అమీ జోన్స్‌ (సి)షెఫాలీ వర్మ (బి)దీప్తి శర్మ 5, సోఫియా ఎక్లేస్టోన్‌ (బి)గైక్వాడ్‌ 10, ఛార్లెట్‌ డీన్‌ (నాటౌట్‌) 20, క్రాస్‌ (బి)దీప్తి శర్మ 16, లారెన్‌ ఫిల్లెర్‌ (బి)దీప్తి శర్మ 0, లారెన్‌ బెల్‌ (సి)రోడ్రిగ్స్‌ (బి)గైక్వాడ్‌ 8, అదనం 7. (27.3ఓవర్లలో ఆలౌట్‌) 131పరుగులు. వికెట్ల పతనం: 1/27, 2/37, 3/37, 4/68, 5/68, 6/83, 7/83, 8/108, 9/108, 10/131 బౌలింగ్‌: రేణుక సింగ్‌ 6-1-30-1, స్నేV్‌ా రాణా 4-0-19-0, పూజ వస్త్రాకర్‌ 4-1-23-3, దీప్తి శర్మ 8-2-32-4, రాజేశ్వరి 5.3-1-20-2.

మహిళల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రికార్డు విజయాలు..

347 : భారత్‌ (ఇంగ్లండ్‌పై), ముంబయి-2023309 : శ్రీలంక (పాకిస్తాన్‌పై), కొలంబో-1998188 : న్యూజిలాండ్‌ (దక్షిణాఫ్రికాపై), డర్బన్‌-1972186 : ఆస్ట్రేలియా (ఇంగ్లండ్‌పై), ఆడిలైడ్‌-1949185 : ఇంగ్లండ్‌ (న్యూజిలాండ్‌పై), అక్లాండ్‌-1949

➡️