నేలవాలిన వరి పైరు

Dec 4,2023 23:46

ప్రజాశక్తి – చెరుకుపల్లి
మిచాంగ్ తుఫాను దాటికి మండలంలో వరి పైరు అక్కడక్కడ నేల వాలింది. కొంతమేర వరికుప్పలు వేసినప్పటికీ మరికొంత వరిపైరు కుప్పలు వేయకపోవడంతో వర్షానికి నీళ్లలో తడిచింది. 60శాతానికిపైగా వరిపైరు కోత దశకు వచ్చి కోయల్సి ఉండగా తీవ్ర తుఫాను నేపథ్యంలో సోమవారం సాయంత్రం వరకు గాలులతో కూడిన జల్లులు పడడంతో రైతులు ఆందోళన చెందారు. అధిక గాలులతో కూడిన వర్షపు జల్లులు పడ్డాయి. తీవ్ర తుఫాను మంగళ, బుధవారాల్లో అధిక శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కొంతమేర నష్టం వాటిల్లినప్పటికీ వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు దిగాలు చెందుతున్నారు. తహసిల్దారు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. తహశీల్దారు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

➡️