‘సలార్‌పై మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సాధించటం మా టీమ్ అందరికీ మీరిచ్చిన బహుమతిగా భావిస్తున్నాం’ అని హీరో ప్రభాస్ చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన ప్రతిఒక్కరూ నిరంతరం శ్రమించారు. అందుకే ఇంత గొప్ప అవుట్‌ఫుట్ వచ్చింది. ప్రేక్షకులంతా దీన్ని ప్రశంసిస్తుంటే మా అందరికీ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తాను. మీరంతా నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా చేసుకోండి..సలార్‌ను ఆదరించినందుకు ధన్యవాదాలు’ అని వివరించారు.