ఘనంగా గుంటూరు బాపనయ్య వర్ధంతి

Mar 25,2024 12:29 #Krishna district

 బాపనయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న సిపిఎం పార్టీ నాయకుల 
ప్రజాశక్తి-చల్లపల్లి : గుంటూరు బాపనయ్య 46వ వర్ధంతిని స్థానిక శ్రామిక గుంటూరు బాపనయ్య భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల పార్టీ కార్యదర్శి యద్దన మధు మాట్లాడుతూ విద్యార్థి దశలో కుల వివక్షతను ఎదుర్కొన్న బాపనయ్య మాకినేని బసవ పున్నయ్య స్ఫూర్తితో కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన జీవిత కాలమంతా పీడిత ప్రజా ఉద్ధరణకు విప్లవ సాధనకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. చల్లపల్లి జమిందార్ కు వ్యతిరేకంగా మంగళాపురం లో ముదిరాజులకు బంజర భూమి పోరాటానికి చంద్ర రాజేశ్వరరావు, చల్లపల్లి నారాయణరావుతో కలిసి నాయకత్వం వహించారు అని వివరించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో బాపనయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన జీవితాంతం నిరుపేద గానే సాగింది అని విచారం వ్యక్తం చేశారు. కుల పీడనకు వ్యతిరేకంగా సామాజిక న్యాయానికి ఎర్రజెండాను అండగా చేసుకొని దళిత వాడల అంతలోనూ ఎర్రజెండా ఎగురవేసేందుకు ఎనలేని కృషిచేసిన అమరజీవి కామ్రేడ్ బాపనయ్యని ఆయన సేవలను కొనియాడారు. సీనియర్ నాయకులు వాకా రామచంద్రరావు మాట్లాడుతూ దివి ప్రాంతంలో నాడు నెలకొన్న కుల వివక్షతను ఎదుర్కొని, విద్యార్థి దశ నుండే దళితుల అభ్యున్నత కోసం పోరాడి నీతి నిజాయితీ గల నాయకుడిగా ప్రజాసేవ కు మారు పేరుగా ప్రజల గుండెల్లో చిర స్తాయిగా నిలిచిన వ్యక్తి బాపనయ్య అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు దళిత వర్గాల ప్రజలకు అంకితభావంతో పనిచేసిన వ్యక్తి బాపనయ్యని, నేటి యువతరం, నేటి నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆశయం కోసం కృషి చేయాలని కోరారు.

➡️