ఈనెల 16న గాయత్రి విద్యా పరిషత్‌ డిగ్రీ కళాశాల స్నాతకోత్సవం

Mar 14,2024 14:33 #visakhapatnam

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ :గాయత్రి విద్యా పరిషత్‌ కళాశాల 11 , 12వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 16వ తేదీన రుషికొండ వద్ద ఉన్న గాయత్రి విద్యా పరిషత్‌ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని కళాశాల కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ అధికారి కే.మురళి సోమేశ్వరరావు తెలిపారు. గురువారం ఉదయం ఎంవిపి కాలనీలోని గాయత్రి విద్యా పరిషత్‌ కాలేజ్‌ ఫర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కోర్సెస్‌(అటానమస్‌) కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా పరిషత్తు సంస్థ యాజమాన్య సభ్యులు డివిఎస్‌ కామేశ్వరరావు మాట్లాడుతూ స్నాతకోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గన్న 2020-21,2021-22 సంవత్సరాల లో ఉత్తీర్ణులైన డిగ్రీ , పీజీ విద్యార్థులకు ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుండి 5 గంటల మధ్య పట్టాలు పంపిణీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు ఉపకులపతి ఆచార్య పీ వి జి డి ప్రసాద్‌ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు.ఎప్పటికే 800 మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని రానున్న రెండు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ స్నాతకోత్సవాన్ని గతంలోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చామని ఆయన తెలిపారు ఈ స్నాతకోత్సవం లో 2021లో ఉత్తీర్ణులైన 875 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 263 మంది పీజీ విద్యార్థులు ఉండగా 2022 విద్యా సంవత్సరం లో ఉత్తీర్ణులైన 901 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు 305 మంది పీజీ విద్యార్థులకు మొత్తం 2344 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యాజమాన్య సభ్యులు ఆచార్య రాజ గణపతి కళాశాల, ప్రిన్సిపల్‌ ఎస్‌ రజిని, కళాశాల పిఆర్‌ఓ శేషు పద్మ, కళాశాల డైరెక్టర్‌ ఆనంద్‌, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️