Google : వందలాది మంది ఉద్యోగులకు గూగుల్‌ ఉద్వాసన

Jan 11,2024 13:29 #Google, #Lays Off

ఇంటర్నెట్‌డెస్క్‌ : గూగుల్‌ మరోసారి వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. గూగుల్‌ కంపెనీలో డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్‌, ఇంజనీరింగ్‌ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. కేవలం ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. 2023 ద్వితీయార్థంలో మా కంపెనీకి చెందిన అనేక బృందాలు సమర్థవంతంగా పనిచేయడానికి మార్పులు జరిగాయి. ఈరకమైన మార్పుల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. అని గూగుల్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తొలగించిన ఉద్యోగులు గూగుల్‌లోనే వేరేచోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఉద్యోగులను తొలగించడాన్ని ఆల్ఫాబెట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎడబ్ల్యుయు) విమర్శించింది. అలాగే గూగుల్‌ కంపెనీ ఉద్యోగులను తొలగించడంపై సహోద్యోగులు మండిపడుతున్నారు. ‘మా వినియోగదారుల కోసం గొప్ప ఉత్పత్తులను రూపొందించడానికి మా సభ్యులు, సహచరులు ప్రతిరోజూ కష్టపడతారు. అయితే ప్రతి త్రైమాసికంలో బిలియన్లు ఆర్జిస్తున్నప్పుడు కంపెనీ మా సహోద్యోగులను తొలగించడం కొనసాగించదు. కంపెనీలో మా ఉద్యోగాలు సురక్షితంగా ఉండే వరకు మేము పోరాటం ఆపము’ అని గూగుల్‌ కంపెనీ గ్రూప్‌ మెంబర్స్‌ తెలిపారు.

➡️