‘గ్లోబల్ హెల్త్ కేర్ ‘ ఆసుపత్రిని ప్రారంభించిన : డాక్టర్ అశోక్ కుమార్

Jan 6,2024 15:49 #Visakha
global health care opening

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలోని సీతమ్మధార-హెచ్ బి కాలనీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ హెల్త్ కేర్ ‘ సెంటర్ ను కే‌జి‌హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్. అశోక్ కుమార్ శనివారం ఉదయం ప్రాంభించారు. అనంతరం అయన మీడియా తో మాట్లాడుతూ విశాఖ మహా నగరంలో అనేక హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వాటిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పాటు కార్పొరేట్ వైద్య సంస్థలు , ప్రైవేటు వైద్య సంస్థలు ఉన్నాయని వారి వారి స్థోమత ప్రకారం ప్రజలకు వైద్యం అందుతుందని ,ప్రభుత్వం వాడవాడల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నదని, ఈ సంధర్బంలో సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు , లేబ్ టెస్టులు ,ఫార్మసీ ,, డాక్టర్ చాంబర్స్ లను గ్లోబల్ హెల్త్ కేర్ పేరుతో ఒకే చోట చేర్చి ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.అనంతరం గ్లోబల్ హెల్త్ కేర్ నిర్వాహకులు రవీంద్ర నాథ్, పరశురామ్ మాట్లాడుతూ సీతమ్మదార, హెచ్ బి కాలనీ పరిసర ప్రాంత వాసులకు అందుబాటు ధరలలో వైద్య సేవలు అందించాలనే దృక్పధంతో తాము ఈ సెంటర్ ను ప్రారంబించామని సత్వర వైద్య సేవలు అందక అనేక మంది రోగులకు ప్రాణ పాయ పరిస్తితుల లోనికి వెళుతున్నారని ,తమ సెంటర్ లో అతితక్కువ ఫీజులు , మెడికల్ టెస్ట్లు ,మెడిసిన్ పై తగ్గింపుఅందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికి కార్పొరేటర్లు అప్పరి విద్యా , మొల్లి లక్ష్మి అప్పారావు, స్థానిక ప్రముఖులు బాబ్జీ , చిరంజీవి, రవి శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.

➡️