‘తంగలాన్‌’ గ్లింప్స్‌

Apr 17,2024 18:56 #New Movies Updates, #vikram

విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’ చిత్రం నుండి తాజాగా గ్లింప్స్‌ విడుదల చేశారు. పా రంజిత్‌ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, జియో స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ప్రొడ్యూసర్‌ కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం ఈ స్పెషల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది. గ్లింప్స్‌ రిలీజ్‌ సందర్భంగా దర్శకుడు పా. రంజిత్‌ మాట్లాడుతూ, ”తంగలాన్‌” సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్‌ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్‌తో పాటు మూవీ టీమ్‌ ఎంతో సపోర్ట్‌ చేసింది. జియో స్టూడియోస్‌ ఈ సినిమా కోసం స్టూడియో గ్రీన్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. విక్రమ్‌ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్‌ మీకు చూపిస్తుంది’ అన్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

➡️