ఇంటర్‌ ఫలితాల్లో బాలికల సత్తా

Apr 13,2024 00:33

ఇంటర్‌ విద్యార్థులతో మోడరన్‌ అధినేత లయన్‌ జీవి రావు

ప్రజాశక్తి-యంత్రాంగం

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికల సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. గురుకుల పాఠశాల్లోముమ్మిడివరం ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ చాటారని ముమ్మిడివరం బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ టి.గంగాభవాని తెలిపారు. ఠానేలంక పంచాయతీ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించి ప్రతిభ చాటారన్నారు మొదటి సంవత్సరం ఫలితాల్లో 74 శాతం,రెండో సంవత్సరం ఫలితాల్లో 76.56 శాతం సాధించారని, మొదటి సంవత్సరం ఎంపిసి విద్యార్దిని సిహెచ్‌ మౌనిక 448 మార్కులు సాధించగా, బైపిసి విద్యార్దిని పి శ్రావణి జ్యోతి 389 మార్కులు, రెండో సంవత్సరానికి చెందిన ఎంపిసి విద్యార్థినిలు ఎన్‌.మాధవి, కె. కపా జాస్మిన్‌ 855 మార్కులు సాధించారు. సీనియర్‌ బైపిసిలో పి.శ్రావణి సుధా 873 మార్కులు సాధించింది..ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సిబ్బంది, పేరెంట్స్‌ అభినందించారు. అలాగే డాక్టర్‌ మోకా గణపతి రావు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలకు 79 మంది హాజరు కాగా వీరిలో 37 మంది ఉత్తీర్ణులయ్యారనినిలిచారన్నారు. ఎంపిసి విద్యార్థి గుత్తుల యోగేంద్ర 885 మార్కులు, బైపిసి లో సిహెచ్‌ గీతిక 839 మార్కులు, సిఇసిలో ఐ.అరుణ 883, హెచ్‌ఇసిలో ఎ.సుప్రియ 788 మార్కులు సాధించారని ప్రిన్సిపల్‌ ఎస్‌.మంగా రామ్‌ తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన విద్యాధర్‌ ఆలమూరు ఇంటర్‌ ఫలితాలలో మండల కేంద్రానికి చెందిన యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు, స్థానిక ఉపాధ్యాయుడు అద్దరి శ్రీనివాసరావు తనయుడు విద్యాధర్‌ ఎంపిసిలో 985 మార్కులు సాధించాడు గతంలో ఈ విద్యార్థి జాతీయ స్థాయి జెఇఇ మెయిన్స్‌ నందు 99.106శాతం అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. విద్యాధర్‌ సాధిస్తున్న విజయాలకు తల్లిదండ్రులు శ్రీనివాసు, జ్యోతి దంపతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్లో సత్తా చాటిన విద్యాధర్‌ ను పలువురు ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు అభినందనలు తెలియజేశారు. సిద్ధార్థ విజయ దుందిభి కొత్తపేట కొత్తపేట సిద్ధార్థ జూనియర్‌ కళాశాల 2024 ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ లో తమ విద్యార్థులు విజయ దుందిభి మ్రోగించినట్లు కళాశాల ప్రిన్సినల్‌ కట్టా నాగమోహన్‌ తెలిపారు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఎంపిసి గ్రూపులో ఎ.అసూజ 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించినట్లు మరో ఎంపీసీ విద్యార్థిని వి జోష్ణవి 470 మార్కులు గాను 462 మార్కులు సాధించినట్లు తెలిపారు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఎంపిసి గ్రూపులో తమ విద్యార్థులు సిహెచ్‌ ప్రజ్ఞ 1000 మార్కులు గాను980 మార్కులు సాధించినట్లు అలాగే కెవిడి.లావణ్య 1000 గాను 977 మార్కులు సాధించారన్నారు అలాగే బైపిసి గ్రూపులో 1000 మార్కులకు గాను ఎన్‌ వి అక్షయ సావిత్రి 960జ్‌ మార్కులు సాధించారు కే దివ్య లక్ష్మి 954 మార్కులు సాధించారు జూనియర్‌ ఇంటర్‌లో ఎడ్యుకేర్‌ ప్రభంజనం మామిడికుదురు నగరం, తాటిపాక ఎడ్యుకేర్‌ జూనియర్‌ ఇంటర్‌ లో సుందర రమ్య విజయ శ్రీ జూనియర్‌ బై పి సి విభాగంలో 434మార్కులు సాధించి కోనసీమ జిల్లా సాయిలో ప్రధమ సానం లో నిలిచింది. జూనియర్‌ ఎంపిసి విభాగంలో సిహెచ్‌.లక్ష్మీ రమ్య శ్రీ 461, జి లశ్వర్య 460, జశ్వంత్‌ సూర్య శ్రీనివాస్‌ 460మార్కులు, ఎస్‌ గీతా సాయి ప్రవల్లిక 460, కంబాల అంజు ప్రణవి 463, జితేంద్ర నాగ సాయి 462మార్కులు సాధించి స్కూల్‌ టాపర్‌ గా నిలిచారని కరస్పాండ్‌ కె.మురార్జీ తెలిపారు విజేతలను అభినందించారు.సాయి దీప్తి విజయ కేతనం మామిడికుదురు ఇంటర్‌ ఫలితాలలో నగరం సాయి దీప్తివిద్యార్థులు జూనియర్‌ విభాగంలో నల్లా హారిక ఎం పి సి లో 470కి 461మార్కులు సాధించి మండల ప్రధమ సానంలో నిలిచింది కాడి నాగ దుర్గ 457మార్కులు సాధించి ద్వితీయ సానం లో నిలిచిందని డి వి వి సత్యనారాయణ తెలిపారు సీనియర్‌ ఇంటర్‌ ఎం పి సి విభాగంలో చిట్టినీడి మినా 976మార్కులు సాధించారు విజేతలను పిన్సిపాల్‌, మరియు ఉపాధ్యాయులు అభినందించారు.ఇంటర్‌ ఫలితాల్లో పట్టణ అగ్రగామి మోడరన్‌ రామచంద్రపురం శుక్రవారం ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మోడరన్‌ జి ఆర్‌ సి జూనియర్‌ కాలేజీ అన్ని గ్రూప్‌ల్లో ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ నందు అత్యుత్తమ మార్కులు సాధించి పట్టణంలో అగ్రగామిగా నిలిచారని మోడరన్‌ విద్యాసంస్థల అధినేత లయిన్‌ జి.వి.రావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎంపిసి నందు జివ్ణి.సాయి దుర్గ 464, ఎస్‌. కీర్తన 463, పి.తరుణ్‌ కుమార్‌ 462,పి. తనూజ 462, కె.కీర్తీక 462,డి. అంజి 461, బి. జస్వంత్‌ 461, టి. సోఫియా 460 మార్కులు సాధించారని, అదేవిధంగా బైపీసీలో పి.లక్ష్మి సత్య శ్రావ్య -422, షేక్‌ అశ్వక్‌ 418, పి. భవాని -418, బి.చాందిని -416 మార్కులు, సిఈసి విభాగంలో కెవిఎస్‌ రమ్య దుర్గ 485, మార్కులు, ఎంఈసి లో జి.చంద్రిక 480మార్కులు, సెకండ్‌ ఇయర్‌ ఎంపీసీ గ్రూప్‌ నందు ఐ. లాస్య -988, కె. సుహార్షిత్‌ -987, కె. గురుదత్త -984, ఎన్‌. సంతోష్‌ -981, పి మేఘన -981, సయ్యద్‌ హసీనా భాను -981, ఎల్‌. నిఖిత దేవి -980 మార్కులు, సీనియర్‌ బైపీసీ నందు ఓ. సత్యవతి -985,ఎ. ప్రవీణ -971, పి. వినయశ్రీ 968, కెఎల్‌.శరణ్య 966, పి. అక్షర 966 మార్కులు సాధించారు. సీనియర్‌ సీఈసీ నందు ఐ.హర్షిత 954 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా అత్యుత్తమ మార్కులు సాధించిన మోడరన్‌ విద్యార్థులను ఆర్‌డిఒ ఎస్‌.సుధాసాగర్‌ ప్రత్యేకంగా అభినందించారు. పిన్సిపల్‌ సి.హెచ్‌.రాజేష్‌ , వైస్‌ ప్రిన్సిపల్‌ పి. ఎస్‌. ప్రకాష్‌, అకడమిక్‌ అడ్వైజర్‌ సి. హెచ్‌ శ్రీనివాస్‌,ఇంటర్‌ స్టాఫ్‌ అభినందనలు తెలిపారు ఇంటర్‌ ఫలితాల్లో ఎంపిఎస్‌ ప్రభంజనం మండపేట స్థానిక మండపేట పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు శుక్రవారం ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ఇంటర్‌ లో ప్రభంజనం సష్టించారు. ఎంపిసి గ్రూపులో విద్యార్దులు సిహెచ్‌ సాత్విక, కె. సాయి కుమార్‌ లు 464 మార్కులతో స్టేట్‌ 4వ ర్యాంకు, ఎం.సత్య ప్రసన్న, కె. సాయి వినరు మౌళి, సిహెచ్‌ ఉమా సుప్రజ 463 మార్కులతో స్టేట్‌ 5వ ర్యాంకు, పి.నాగ సాహితి 462 మార్కులతో స్టేట్‌ 6వ ర్యాంకు, ద్వితీయ సంవత్సర ఎంపీసీ గ్రూపు ఫలితాలలో టి.అమత సాయిశ్రీ చంద్రిక, పి. విష్ణువర్ధన్‌ 985, ఎ.మోహన్‌ చంద్ర 984, షేక్‌ రుబీనా 982 మార్కులతో కాలేజ్‌ టాపర్లుగా నిలిచారు. కాలేజ్‌ కరస్పాండెంట్‌ వల్లూరి చిన్నారావు విద్యార్థులను అభినందించారు. ఇంటర్‌ లో వైష్ణవి విద్యార్థుల ఉత్తమ ప్రతిభస్థానిక ఆలమూరు రోడ్డులోని వైష్ణవి ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీ విద్యార్ధులు ఉత్తమ ప్రతిభను కనబరిచి ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్‌, లయన్‌ కోనే వీర్రాజు తెలిపారు. రెండవ సంవత్సరం డైరీ సైన్సు విద్యార్ధిని రెడ్డి లక్ష్మీ లావణ్య 964 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, రెండవ సంవత్సరం ఎం పి హెచ్‌ డబ్ల్యు కోర్సులో బంగారు అరుణ 925 మార్కులతో రెండవ ర్యాం కు, సిపిఎం కోర్సులో కుంజం అంజలి 904 మార్కులతో తతీయ ర్యాంకు సాధించారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్ధులు డైరీ సైన్సు కోర్సులో పల్లాల శ్రీదేవి 474, సిపి అండ్‌ ఎం కోర్సులో పీతల దీప్తి 456, ఎం ఎల్‌ టి కోర్సులో ఇంజేటి మౌనిక 451 మార్కులతో మండలం, టౌన్‌ ఫస్ట్‌ ర్యాంకులు సాధించారు. అంగర శ్రీ సిద్ధార్థ విద్యార్థుల ప్రతిభ కపిలేశ్వరపురం రూరల్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో కపిలేశ్వరపురం మండల పరిధి అంగర శ్రీ సిద్ధార్ధ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ సాధించారు.

 

➡️