సార్వత్రిక ఎన్నికలు – బిజెపి మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోడి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోడి గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో మొత్తం 14 అంశాలతో రూపొందించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతఅత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టో కోసం దాదాపు 15 లక్షల సలహాలు సూచనలు పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి.

➡️