గ్యాస్ లీకై అగ్నిప్రమాదం

Mar 9,2024 14:20 #Konaseema

గృహిణికి గాయాలు
ప్రజాశక్తి-మండపేట : ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో గృహిణి స్వల్ప గాయాల పాలయ్యింది. స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక రైతు బజార్ ఎదురుగా ఉన్న వీధిలో కొత్తల అప్పారావు భార్య కృష్ణవేణితో కలిసి జీవిస్తున్నాడు. శనివారం ఉదయం వంట చేసేందుకు కృష్ణవేణి గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో కేకలు పెట్టింది చుట్టుపక్కల వారు ఇది గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మండపేట అగ్నిమాపక అధికారి హనుమంతరావు తన సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ రెండు లక్షల ఆస్తి నష్టంతో పాటు గృహిణి స్వల్పంగా గాయపడిందని అగ్నిమాపక అధికారి తెలిపారు.

➡️