మార్చి 8న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’

Jan 1,2024 19:30 #New Movies Updates

విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా నుండి తాజాగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఈ స్పెషల్‌ పోస్టర్‌లో సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. 2024 మార్చి 8న ఈ చిత్రం విడుదలకానుంది. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్ట్యూన్‌ ఫోర్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

➡️