చిన్నారులు, చిన్నారులు
కమ్మని పాటలు ఆలకిస్తారా..
ఒక అడవిలో రెండు చిట్టెలుకలు
అటు ఇటు గెంతుతున్నాయి
విచ్చల విడిగా తిరుగుతున్నాయి
మ్యావు అని వినబడేసరికి భయపడి పోతున్నాయి
తప్పించుకోలేక వణికి పోతున్నాయి
అది దగ్గరకు వినిపించి కళ్ళు మూసుకున్నాయి
మ్యావు అంటూ అది వాటి చెవులు దువ్వుతోంది
కళ్ళు తెరవండి నేను మీతో స్నేహం చేస్తాను అంటోంది
మిల మిల కళ్ళు తెరిచాయి పిల్లితో ఆడాయి
రెండు చిట్టెలుకల మధ్యలో పిల్లి గెంతులు వేసింది
వైరం మాకొద్దు స్నేహమే మాకు ముద్దు
స్నేహమే మా జీవితం
స్నేహమే మాకు శాశ్వతం
చెట్టా పట్టాలు వేసుకుని ముందుకు సాగాయి
– కనుమ ఎల్లారెడ్డి,
ఆస్టిన్, టెక్సస్ స్టేట్,
అమెరికా, 93915 23027.