ఉచిత ఆక్యుపంక్చర్‌ వైద్య శిబిరం

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : ఎలాంటి మందులు, ఇంజక్షన్లు ఆపరేషన్లు అవసరం లేకుండా రోగాలను తగ్గించడమే ఆక్యుపంక్చర్‌ వైద్య ముఖ్య లక్షణమని ప్రముఖ ఆక్యుపంక్చర్‌, నేచురోపతి వైద్యులు కొండా శ్రీధర్‌ అన్నారు. ఆదివారం నరసాపురం 9వ వార్డు నందమూరికాలనీ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో కొవ్వలి ఫౌండేషన్‌ చైర్మన్‌ కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌ నాయుడు ఆధ్వర్యంలో ఆ వార్డు మాజీ కౌన్సిలర్‌ పెమ్మాడి వెంకట శ్రీదేవి కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఉచిత ఆక్యుపంక్చర్‌ వైద్య శిబిరంలో శ్రీధర్‌ వైద్య సేవలు అందించి మాట్లాడారు. ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం, పలు వ్యాధుల నివారణకు చిట్కాలు తదితర వాటి పై రోగులకు శ్రీధర్‌ అవగాహన కల్పించారు. ప్రాచీన వైద్యం ఆక్యుపంక్చర్‌ వైద్య విధానానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. సర్వరోగ నివారిణి ఆక్యు పంక్చర్‌ అని అన్నారు. తన కుటుంబ సభ్యుడు కొవ్వలి రామ్మోహన్‌ నాయుడు ఆర్థికసాయంతో నరసాపురం పరిసర ప్రాంతాల ప్రజల కోరిక మేరకు గత సంవత్సరం నుంచి ప్రతి నెలా నిర్విరామంగా ఆక్యుపంక్చర్‌ వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. నరసాపురం నియోజకవర్గంలోనే కాకుండా విశాఖపట్నం, బొబ్బిలి ప్రాంతాల్లో కూడా ఈ ఆక్యుపంక్చర్‌ వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. మాజీ కౌన్సిలర్స్‌ పెమ్మాడి శ్రీదేవి మాట్లాడుతూ సమాజానికి కొవ్వలి ఫౌండేషన్‌ ద్వారా కొవ్వలి యతిరాజ రామ్మోహన్‌ నాయుడు, కొండా శ్రీధర్‌ లు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ సందక సురేష్‌, గునిశెట్టి రామకఅష్ణ, పొన్నమండ మురళీ, వనమాల వెంకటరావు, నండా రామకఅష్ణ, గూడాల సునీత, బి రాజేశ్వరి, సావిత్రి, నిమ్మకాయల బాబ్జీ, కామిరెడ్డి బాబు తదితరులు ఉన్నారు.

➡️