ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు

Mar 21,2024 12:24 #srikakulam

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : ఎటువంటి ఆర్థిక స్థోమత లేక సరైన న్యాయం పొందలేక క్రిమినల్ కేసుల్లో ఇరొక్కొని జైలులో మృగ్గుతున్న అనేక మంది ఖైదీలకు ఉచిత లీగల్ సహాయం అందించేదుకు శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానంలో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేశామని, సీనియర్ సివిల్ జడ్జ్, శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి ఎం. సన్యాసి నాయుడు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ… జాతీయ లీగల్ సర్వీస్ ఆధారి టీ వారి సూచనలు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల పరిధిలో ఈ కేంద్రాలు గత ఏడాది అక్టోబర్ లో ఏర్పాటు చేశామని చెప్పారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న నిరుపేదలకు బడుగు బలహీనవర్గాలకు ఈ ఉచిత డిఫెన్స్ సిస్టమ్ ఒక వరంలా పనిచేస్తుందని అన్నారు. కారాగారాల్లో మ్రగ్గుతున్న కైదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ సభ్యులు జి.ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

➡️