మహిళల కోసం… ‘సేఫర్‌ స్మార్ట్‌ జ్యూవెలరీ’ లాకెట్‌ …!

ఇంటర్‌నెట్‌ : సమాజంలో మహిళల రక్షణ కోసం …. ‘స్మార్ట్‌ జ్యూవెలరీ’ వచ్చింది. ఇప్పటికే టెక్నాలజీతో పలురకాల వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. కొన్ని స్మార్ట్‌ వాచెస్‌… దాన్ని ధరించిన వ్యక్తి ప్రమాదంలో ఉంటే వెంటనే రియాక్ట్‌ అయ్యి… అంబులెన్స్‌కు, పోలీసులకు కాల్‌ చేస్తాయి.. సదరు వ్యక్తి బిపి, షుగర్‌ లెవల్స్‌ను చెబుతూ అప్రమత్తం చేస్తుంటాయి.. ఈ తరహాలోనే ముఖ్యంగా మహిళలకు రక్షణ కలిగే విధంగా టెక్నాలజీ సాయంతో ఓ ‘స్మార్ట్‌ జ్యూవెలరీ’ని రూపొందించారు..!

టెక్నాలజీ పెరుగుతున్న వేళ … మహిళలకు భద్రత కల్పించేలా పలు యాప్స్‌ ఇప్పటికే అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా ఎవరైనా అపరిచితులు మహిళలను వెంబడిస్తునప్పుడు వారు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేసేలా ప్రత్యేక ‘స్మార్ట్‌ జ్యూవెలరీ’ రూపొందింది.

ఎలాగంటే …?

ఈ ‘సేఫర్‌ స్మార్ట్‌ జ్యూవెలరీ’లో ఓ లాకెట్‌ ఉంటుంది. అది మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ చేసుకొని మనకు కావాల్సినవారి నంబర్లు సెట్‌ చేసుకోవాలి. దీన్ని చెయిన్‌లా మెడలో వేసుకుని ప్రమాదం వచ్చినప్పుడు లాకెట్‌ వెనుక బటన్‌ని రెండుసార్లు నొక్కితే చాలు. మనకు కావాల్సిన వారికి మనం ప్రమాదంలో ఉన్నామని మెసేజ్‌ వెంటనే వెళుతుంది. అంతేకాదు, యాప్‌ నుంచి మీ లైవ్‌ లకేషన్‌ కూడా షేర్‌ అవుతుంది. దీంతో మిమ్మల్ని వారు సులభంగా చేరుకోగలుగుతారు. అలాగే, ప్రమాదంలో ఉన్నవారు సమీపంలోని హాస్పిటల్‌ లేదా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లేలా నావిగేట్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లోని యాప్‌ల ద్వారా ఈ స్మార్ట్‌లాకెట్‌ను కనెక్ట్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు.

➡️